Breaking News

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై భౌతిక దాడికి కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారనే వార్తలు ప్రకంపనలు సృష్టించాయి.

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై భౌతిక దాడికి కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారనే వార్తలు ప్రకంపనలు సృష్టించాయి.


Published on: 05 Feb 2026 16:59  IST

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై భౌతిక దాడికి కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారనే వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. ప్రధానిని చుట్టుముట్టి దాడి చేసేందుకు విపక్ష మహిళా ఎంపీలను పంపారనే సమాచారం వచ్చిందని లోక్‌సభ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.

ఈ పక్కా సమాచారం అందడం వల్లే ప్రధాని మోదీ ప్రసంగానికి ముందే సభను వాయిదా వేయాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనను సభలోకి రావద్దని స్పీకరే సూచించినట్లు సమాచారం.

అంతకుముందు రోజు (బుధవారం), విపక్ష మహిళా ఎంపీలు బ్యానర్లతో ప్రధాని సీటు వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరియు మాజీ సైన్యాధిపతి నరవణె పుస్తకంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

విపక్షాల నిరసనల మధ్య ఫిబ్రవరి 5న ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. గత 22 ఏళ్లలో ఇలా ప్రధాని ప్రసంగం లేకుండా తీర్మానం ఆమోదించడం ఇదే తొలిసారి.

తమపై వచ్చిన దాడి కుట్ర ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రిపై మహిళా ఎంపీలు దాడి చేస్తారనడం నమ్మశక్యంగా లేదని, ఇది కేవలం తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విపక్షాలు కొట్టిపారేశాయి

Follow us on , &

ఇవీ చదవండి