Breaking News

మార్కాపురంజిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

2026 మార్చి 26, గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లా (ప్రకాశం జిల్లా పరిధి) రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


Published on: 26 Mar 2026 10:35  IST

2026 మార్చి 26, గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లా (ప్రకాశం జిల్లా పరిధి) రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, కంకర లోడుతో ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.సుమారు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఉదయం సుమారు 6:15 నుండి 6:30 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది.మలుపు వద్ద అతివేగంగా వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.బాధితుల వివరాల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి