Breaking News

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారీ ఊరట 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి

మే 29, 2026 న సుప్రీంకోర్టు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారీ ఊరటనిచ్చింది. 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.


Published on: 29 May 2026 17:26  IST

మే 29, 2026 సుప్రీంకోర్టు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారీ ఊరటనిచ్చింది. 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.మే 30, 31 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగబోయే ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో వినేశ్ ఫొగాట్ పోటీ పడవచ్చు.

వినేశ్ ఫొగాట్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే WFI దాఖలు చేసిన ఈ అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ వినేశ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్ 1 వ తేదీకి వాయిదా వేసింది.వినేశ్ ఫొగాట్ ప్రసూతి విరామం తర్వాత మళ్లీ రింగులోకి రావాలని ప్రయత్నించారు.

అయితే, ఆమె గర్భధారణ సమయంలో కొన్ని ముఖ్యమైన టోర్నమెంట్లకు హాజరుకాలేదనే కారణంతో WFI ఎంపిక నిబంధనలను చూపిస్తూ ఆమెను ట్రయల్స్‌కు అనర్హురాలిగా ప్రకటించింది.దీనిపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, "మాతృత్వం అనేది మహిళా అథ్లెట్లను క్రీడలకు దూరం చేయడానికి ఒక కారణం కాకూడదు" అని స్పష్టం చేస్తూ వినేశ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పునే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement