Breaking News

వాట్సాప్ తీసుకురాబోతున్న కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను భారతదేశంలో ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా కు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ తీసుకురాబోతున్న కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను భారతదేశంలో ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.


Published on: 02 Jul 2026 11:29  IST

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా కు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ తీసుకురాబోతున్న కొత్త 'యూజర్నేమ్' ఫీచర్ను భారతదేశంలో ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

సైబర్ మోసాల భయం: ఫోన్ నంబర్ కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్‌తో చాట్ చేసే ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, మరియు 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

నకిలీ ఖాతాల ముప్పు: కేటుగాళ్లు ఇతరుల పేర్లతో లేదా ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్స్ సృష్టించి ప్రజలను సులభంగా మోసం చేయవచ్చని కేంద్రం తెలిపింది.

కేంద్రం ఆదేశాలు

రోల్‌అవుట్ నిలిపివేత: ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి, సంతృప్తి చెందే వరకు ఈ ఫీచర్‌ను ఇండియాలో విడుదల చేయకూడదు.

3 రోజుల్లో వివరణ: ఈ ఫీచర్ భద్రతపై, దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై 3 రోజుల్లోగా పూర్తి నివేదికను, వివరణను సమర్పించాలని మెటాను ఆదేశించింది.

దీనిపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధులు, ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌లో స్కామ్‌లను అరికట్టడానికి తాము పటిష్టమైన భద్రతా లేయర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతానికి ఇది కేవలం యూజర్‌నేమ్ రిజర్వేషన్ దశలోనే ఉందని వివరణ ఇచ్చారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement