Breaking News

అమెరికాలో ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల వీసా అనుమతుల్లో ఏకంగా 62 శాతం కోత పడింది

అమెరికాలో ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల భారతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది.ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం, అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల వీసా అనుమతుల్లో ఏకంగా 62 శాతం కోత పడింది.


Published on: 07 Aug 2026 10:56  IST

అమెరికాలో ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల భారతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది.ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం, అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల వీసా అనుమతుల్లో ఏకంగా 62 శాతం కోత పడింది. వాషింగ్టన్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్’ విశ్లేషించిన గణాంకాల ప్రకారం ఈ చేదు నిజం వెలుగులోకి వచ్చింది.

వీసా అనుమతుల్లో భారీ తగ్గుదల

గత ఏడాది గణాంకాలు: 2024 మే నుండి ఆగస్టు మధ్య కాలంలో 58,694 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 (F-1) స్టూడెంట్ వీసాలు లభించాయి.

తాజా గణాంకాలు: ప్రస్తుత అడ్మిషన్ల సీజన్ నాటికి ఈ సంఖ్య కేవలం 22,149 కి పడిపోయింది.

చైనాతో పోలిక: చైనా విద్యార్థుల వీసాల్లో కేవలం 34 శాతం తగ్గుదల నమోదు కాగా, భారతీయులపైనే దీని ప్రభావం అత్యధికంగా పడింది.

'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్'పాలసీ రద్దు

పాత పద్ధతి: గతంలో ఎఫ్‌-1 వీసాతో వెళ్ళిన విద్యార్థులు తమ కోర్సు (ఉదాహరణకు పీహెచ్‌డీ లేదా ఎమ్మెస్) ఎంతకాలం సాగితే అంతకాలం అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది.

కొత్త నిబంధన: ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసి, గరిష్టంగా 4 ఏళ్ల కాలపరిమితిని మాత్రమే విధిస్తోంది.

సెప్టెంబర్ 15 డెడ్‌లైన్: ఈ కొత్త రూల్ సెప్టెంబరు 15 నుండి అమలులోకి రానుంది. ఒకవేళ కోర్సు 4 ఏళ్లకు మించితే, విద్యార్థులు ప్రత్యేకంగా ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

వర్క్ పర్మిట్పై $100,000 ఫీజు ప్రతిపాదన

చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని లేదా దానిపై $100,000 (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, అమెరికాలో ఉన్న 3.6 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తు మరియు ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో పడనుంది.

కఠినమైన సోషల్ మీడియా స్క్రూటినీ ,రిజెక్ట్ రేట్లు

వీసా ఇంటర్వ్యూల సమయంలో అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.బలమైన అకడమిక్ రికార్డులు, స్కాలర్‌షిప్‌లు ఉన్నప్పటికీ.. చదువు పూర్తికాగానే భారతదేశానికి తిరిగి వచ్చేస్తారనే నమ్మకం లేకపోవడంతో వేలాది మంది వీసాలను తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతానికి భారతీయ విద్యార్థుల వీసా రిజెక్షన్ రేటు దాదాపు 41 శాతానికి చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement