Breaking News

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని నోంతబురి ప్రావిన్స్‌లో గల డెబ్‌సిరిన్ పాఠశాలలో కాల్పుల ఘటనలో మొత్తం ఏడుగురు మృతి

థాయిలాండ్‌లో  పాఠశాల కాల్పుల ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. ఈ దారుణఘటన నేడు ఆగస్టు 7, 2026, శుక్రవారం ఉదయం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని నోంతబురి ప్రావిన్స్‌లో గల డెబ్‌సిరిన్ పాఠశాలలో జరిగింది.


Published on: 07 Aug 2026 15:53  IST

థాయిలాండ్‌లో  పాఠశాల కాల్పుల ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. ఈ దారుణఘటన నేడు ఆగస్టు 7, 2026, శుక్రవారం ఉదయం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని నోంతబురి ప్రావిన్స్‌లో గల డెబ్‌సిరిన్ పాఠశాలలో జరిగింది.

ఘటన వివరాలు

డెబ్‌సిరిన్ స్కూల్లోనే చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో ఈ దాడికి తెగబడ్డాడు. సదరు విద్యార్థి పాఠశాలకు రాకముందే తన ఇంట్లో సొంత తాతయ్య, అమ్మమ్మలను కాల్చి చంపాడు. ఆ తర్వాత తన తాతయ్యకు చెందిన 9mm హ్యాండ్‌గన్‌తో స్కూలుకు వచ్చి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చివరగా నిందితుడైన విద్యార్థి తన్ను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడిలో మొత్తం ఏడుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

ఈ ఘటనలో మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.ప్రస్తుతం థాయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. థాయిలాండ్‌లో తుపాకుల సంస్కృతి, సులభంగా ఆయుధాలు లభించడంపై ఈ ఘటనతో మరోసారి తీవ్ర చర్చ వ్యక్తమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి