Breaking News

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ దారుణహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి (48) గుర్తుతెలియని దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘోరఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


Published on: 13 Aug 2026 10:17  IST

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి (48) గుర్తుతెలియని దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘోరఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటన వివరాలు

కల్లు రూపారెడ్డి (48) కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌ను గత 26 సంవత్సరాలుగా భాగస్వాములతో కలిసి విజయవంతంగా నడుపుతున్నారు.కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని జేబీ హిల్స్ కాలనీలో ఉన్న ఆమె సొంత నివాసంలో ఈ దారుణం జరిగింది.పాఠశాల సెలవుల కారణంగా హైదరాబాద్ వెళ్లిన రూపారెడ్డి, మంగళవారం ఉదయం కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డి పని నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు లోపలికి చొరబడి కత్తితో దాడి చేశారు. ఆమె తలను గోడకేసి కొట్టి, మృతదేహంపై సుమారు 27 సార్లు కత్తితో దారుణంగా పొడిచి కిరాతకంగా చంపేశారు.

బుధవారం ఉదయం ఆమె భర్త హైదరాబాద్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చి, అదే ఇంట్లో పై అంతస్తులో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇచ్చారు. వారు కిందకు వచ్చి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో పడి మరణించి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు

ఘటనా స్థలంలో ఎటువంటి దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు.పక్కా ప్రణాళికతో, సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితుల ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు.పాఠశాల వ్యవహారాల్లో విభేదాలు లేదా కుటుంబ/వ్యక్తిగత కక్షల కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement