Breaking News

ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు

ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు


Published on: 07 Jun 2025 10:06  IST

అమెరికాలో బహుళ రంగాల్లో తనదైన ముద్ర వేసిన టెస్లా సీఈఓ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎక్స్‌ (పూర్వం ట్విట్టర్‌) అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఎక్స్‌లో ఆయన నిర్వహించిన ఓ పోలింగ్ ఈ విషయాన్ని బలపరుస్తోంది. "అమెరికాలో ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యం కల్పించేలా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా?" అని అడిగిన ప్రశ్నకు ఆశించినదానికంటే ఎక్కువ స్పందన లభించింది. ఈ పోలింగ్‌లో పాల్గొన్న వారిలో దాదాపు 80 శాతం మంది కొత్త పార్టీ ఏర్పాటును సమర్థించారు.

ఇప్పటికే రాజకీయ వ్యవస్థపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచే మస్క్, గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ, ఇటీవల ఆయన పరిపాలన తీరు, ప్రభుత్వ ఖర్చులపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా మస్క్‌పై విమర్శలు గుప్పించడంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామాల నడుమ మస్క్‌ రాజకీయ రంగప్రవేశంపై చర్చలు ఊపందుకున్నాయి.

పార్టీ పేరు విషయంలో కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. "ది అమెరికా పార్టీ" అనే పేరును మస్క్ అభిమానులు, నెటిజన్లు సూచించగా, మస్క్ దానిపై సానుకూలంగా స్పందించారు. అయినా కూడా ఇది ప్రస్తుతం ఒక ఆలోచన దశలోనే ఉంది. పార్టీని అధికారికంగా ప్రారంభించేందుకు మస్క్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

కొత్తగా ఒక రాజకీయ పార్టీని స్థాపించడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమొక్రాట్ల హేమాహేమీలు కొనసాగుతున్న నేపథ్యంలో మస్క్ పార్టీకి గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎలాన్ మస్క్ ప్రభావం, వందల మిలియన్ల డాలర్ల ఆర్థిక సామర్థ్యం ఈ ప్రయత్నానికి సహాయపడవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే.. మస్క్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది? నిజంగా పార్టీని స్థాపిస్తారా? లేదా ఇదంతా ఒక సామాజిక చర్చకే పరిమితమా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ అతని ప్రశ్నతో రాజకీయ చర్చలకు కొత్త మలుపు తిరిగినట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement