Breaking News

లండన్‌లో విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే..

ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్‌గా తెలుస్తోంది.


Published on: 14 Jul 2025 08:39  IST

లండన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన బీచ్‌క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ మినీ జెట్, కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. లండన్‌ నుంచి నెదర్లాండ్‌కు బయలుదేరిన ఈ విమానం, ఎయిర్‌పోర్టు నుంచి తక్కువ దూరంలోనే భూమికి ఢీకొని పేలిపోయింది. తక్షణమే మంటలు చెలరేగాయి, భారీగా పొగలు రావడంతో పరిసరాల్లో కలకలం రేగింది.

విమానంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకుపోయినట్టు సమాచారం. అయితే, ప్రయాణికుల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. ఈ విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్ అనే ఊహలు వ్యక్తమవుతున్నాయి – అంటే సాధారణంగా రోగులను తరలించే వాహనం కావచ్చు. ఈ ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ దుర్ఘటన నేపథ్యంలో సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాల రద్దు జరిగాయి. విమానాశ్రయం అధికారులు, స్థానిక పరిశీలన బృందాలు ప్రమాద స్థలాన్ని సమీక్షిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చూసినవారిని కలచివేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి