Breaking News

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ 30 రోజుల్లో 30 వేల కోట్లు..!

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ రానుంది. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచనున్నారు. లైసెన్స్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Published on: 30 Jul 2025 10:43  IST

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పాత మద్యం పాలసీలో భారీ మార్పులు చేయబోతుంది. దీని ప్రకారం.. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడమే కాక.. గడువును కూడా పెంచేందుకు రెడీ అవుతోంది. మార్పులు చేసిన కొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంగళవారం నాడు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఈకొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే అమలు చేసి.. మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. నూతన మద్యం పాలసీ ప్రకారం.. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు రెండేళ్ల గడువుతో మద్యం షాపులకు లైసెన్స్ ఇస్తుండగా.. ఇకపై దాన్ని మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి