Breaking News

విజయ్ దేవరకొండకి మరో హిట్... ఫస్ట్ డే కింగ్‌డమ్ కలెక్షన్స్.

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా జూలై 31న గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ హైప్‌తో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹30 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ₹18 కోట్ల గ్రాస్, అమెరికాలో $1.1 మిలియన్ (అంటే సుమారుగా ₹8 కోట్లు) వసూలయ్యాయి.


Published on: 01 Aug 2025 12:02  IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘కింగ్‌డమ్’ గురువారం ( జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నిసితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాన్నాళ్ల తర్వాత విజయ్ దేవరకొండకి హిట్ వచ్చిందంటూ ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ప్రేయసి రష్మిక మందానా కూడా ‘మనం కొట్టినం’ అంటూ పోస్ట్ చేయడం.. దానికి విజయ్ రిప్లయ్ ఇవ్వడం వైరల్ అయింది. విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో ఢీలా పడినా ‘కింగ్‌డమ్’పై మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌కూడా గట్టిగానే జరిగాయి. బుకింగ్స్ మొదలైన కొద్ది గంటల్లోనే లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించారు. ఇక యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయగా అక్కడా భారీగా టిక్కెట్లు తెగాయి. దీంతో ‘కింగ్‌డమ్’ మూవీ తొలిరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

సాక్నిల్క్ వెబ్‌సైట్ అంచనాల ప్రకారం... ‘కింగ్‌డమ్’ మూవీ తొలిరోజు రూ.15.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సుమారు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిరోజు రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్. ఇక యూఎస్‌లో మొదటిరోజు మిలియన్ మార్క్ దాటేసి 1.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ గత సినిమాల్లో ‘లైగర్’ ఫస్ట్ డే రూ.33 కోట్ల గ్రాస్, డియర్ కామ్రేడ్ రూ.20 కోట్లు, ఖుషీ చిత్రానికి రూ.16 కోట్ల గ్రాస్ వచ్చింది. తాజాగా విడుదలై ‘కింగ్‌డమ్’ విజయ్ చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్స్‌‌లో సెకండ్ ప్లేస్‌‌లో నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి