Breaking News

నేషనల్ క్రష్ రష్మిక సినిమాలతోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటుంది

నిత్యం వార్తల్లో ఉండే రష్మిక మందానా తనపై వచ్చే ట్రోలింగ్, గాసిప్‌లపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. కానీ నా దయను చాలా మంది అసత్యంగా భావిస్తారు. నిజాయతీగా ఉన్నప్పుడు వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది" అన్నారు. ట్రోలింగ్‌తో ఎదురైన నెగెటివిటీని ఎదుర్కొనడం ఎంత కష్టమో వివరించారు. ఈ ప్రపంచంలో మనం గెలవడం కోసం ఎదురువారిని తొక్కేయడం కరెక్ట్ కాదన్నారు.


Published on: 08 Aug 2025 10:43  IST

నేషనల్ క్రష్ రష్మిక సినిమాలతోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అవగాహన లేకుండా చేసే వ్యాఖ్యల వల్ల సోషల్‌మీడియాలో తరుచూ ట్రోలింగ్‌కి గురవుతుంటుంది. ఇక విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ ఎప్పుడూ హాట్‌టాపిక్కే. అయితే తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా, ట్రోలింగ్‌కి గురవుతున్నా రష్మికలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. తన సినిమాలు, తన లైఫ్ అంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అయితే తాను అలా ఉండటానికి కారణాలేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. తాను భావోద్వేగాల్ని అంత త్వరగా బయటపెట్టనని, అందుకే తనకు పొగరని అనుకుంటారని తెలిపింది రష్మిక.

Follow us on , &

ఇవీ చదవండి