Breaking News

పండుగలాంటి వార్త.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!

పండుగలాంటి వార్త.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!


Published on: 04 Sep 2025 09:59  IST

జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన నిర్ణయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా పన్నుల్లో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రద్దు చేసి, కేవలం రెండు స్లాబులు – 5% మరియు 18% మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. అదనంగా విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 40% పన్ను విధించనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

పూర్తిగా పన్ను రద్దు చేసిన ఉత్పత్తులు
ప్రజలకు అత్యవసరమైన కొన్ని ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేసింది.

  • 33 కీలక ఔషధాలు

  • లైఫ్, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు

  • విద్యార్థుల కోసం మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, నోట్‌బుక్స్, పెన్సిల్స్, షార్ప్‌నర్స్, ఎరైజర్స్

5% జీఎస్టీ స్లాబ్
ఇంతకు ముందు 12%–18% ఉన్న నిత్యవసర ఉత్పత్తులపై ఇప్పుడు కేవలం 5% పన్ను మాత్రమే ఉంటుంది.
ఇందులో:

  • హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, సబ్బులు, షేవింగ్ క్రీమ్

  • పాలు, వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ఉత్పత్తులు

  • బిస్కట్లు, బేకరీ ఐటెమ్స్, నమ్‌కీన్స్, చాక్లెట్స్

  • కాఫీ, టీ, ప్యాకేజ్డ్ రొట్టెలు (చపాతీ, పరోటా)

  • డ్రైఫ్రూట్స్, నట్స్, ఐస్‌క్రీమ్స్, ఫ్రోజన్ ఫుడ్స్

  • ఫ్రూట్ డ్రింక్స్, బేవరేజెస్, సాస్, జామ్, సలాడ్స్

  • బేబీ కేర్ ఉత్పత్తులు (డైపర్లు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్లు)

  • డయాగ్నస్టిక్ పరికరాలు, కళ్లద్దాలు, మెడిసిన్స్

  • ట్రాక్టర్ విడి భాగాలు, సైకిల్స్, పంట పరికరాలు, బయో పెస్టిసైడ్స్

18% జీఎస్టీ స్లాబ్
ఇంతకు ముందు 28% పన్ను ఉన్న అనేక వస్తువులను ఇప్పుడు 18%కి తగ్గించారు.
ఇందులో:

  • సిమెంట్

  • రెండు చక్రాల వాహనాలు, మూడు చక్రాల వాహనాలు

  • చిన్న కార్లు (350cc లోపు)

  • టీవీలు, ఏసీలు, ప్రొజెక్టర్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్

40% జీఎస్టీ స్లాబ్
అత్యధిక పన్ను కేవలం విలాసవంతమైన వస్తువులపైనే అమలు చేస్తారు.

  • 1200cc పైగా పెట్రోల్ కార్లు

  • 1500cc పైగా డీజిల్ కార్లు

  • పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా)

  • కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్

ప్రభుత్వం అభిప్రాయం
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్కరణలు రైతులకు, పేదలకు, మధ్యతరగతికి ఉపశమనం కలిగిస్తాయని, ఇది నెక్ట్స్ జనరేషన్ రీఫార్మ్స్‌కు నాంది అవుతుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ మార్పులు ఆరోగ్య, విద్య, వ్యవసాయ రంగాల్లో గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి