Breaking News

గగన్ యాన్ కు వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరే: ISRO ప్రకటన

భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్ తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో గగన్ యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.


Published on: 27 Feb 2024 15:00  IST

అంతరిక్షానికి వెళ్లే నలుగురు వ్యోమగాముల్ని ఇస్రో ఎంపిక చేసింది. వీరి పేర్లు, ఇతర వివరాలను ఇవాళ వెల్లడించింది. గగన్ యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు.

ఈ నలుగురిని గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లు ఇస్రో ఇవాళ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిని ప్రధాని మోడీ ఇవాళ స్వయంగా కలిసి అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి