Breaking News

పల్నాడు జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం రాత్రి (డిసెంబర్ 4, 2025) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు


Published on: 05 Dec 2025 12:26  IST

పల్నాడు జిల్లాలో గురువారం రాత్రి (డిసెంబర్ 4, 2025) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డు (NH-16).గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కారులో ఒంగోలు వైపు వెళ్తుండగా, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వారి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులను రామిరెడ్డి, శ్రీకాంత్, మహేష్, కార్తీక్, వాసులుగా గుర్తించారు.మృతి చెందిన విద్యార్థులందరూ అయ్యప్ప మాల ధారణలో ఉన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement