Breaking News

భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక ఖనిజాలు , అరుదైన లోహాల సరఫరా, మైనింగ్ మరియు ప్రాసెసింగ్‌కు సంబంధించిన చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.

భారత్, అమెరికా మధ్య 2026 మే 26న వ్యూహాత్మక ఖనిజాలు , అరుదైన లోహాల సరఫరా, మైనింగ్ మరియు ప్రాసెసింగ్‌కు సంబంధించిన చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.


Published on: 26 May 2026 19:38  IST

భారత్, అమెరికా మధ్య 2026 మే 26న వ్యూహాత్మక ఖనిజాలు , అరుదైన లోహాల సరఫరా, మైనింగ్ మరియు ప్రాసెసింగ్కు సంబంధించిన చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ (Quad) విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ల్యాండ్‌మార్క్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

చైనా గుత్తాధిపత్యానికి చెక్: ప్రస్తుతం హై-టెక్ ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఈవీ (EV) బ్యాటరీలు, రక్షణ రంగ పరికరాల తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనా ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది. ఈ సప్లై చైన్ మార్కెట్ నుండి చైనా ప్రభావాన్ని తగ్గించడం ఈ డీల్ ముఖ్య లక్ష్యం.

సప్లై చైన్ బలోపేతం: వ్యూహాత్మక ఖనిజాల సురక్షితమైన మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు వాటి సరఫరాల కోసం ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి.

ఉమ్మడి పెట్టుబడులు: ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఫైనాన్సింగ్ (ఆర్థిక సహాయం), ఉమ్మడి పెట్టుబడులను (Co-investment) పెంపొందించుకోవడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడుతుంది.

వ్యూహాత్మక భాగస్వామ్యం: రక్షణ, అంతరిక్ష, అధునాతన సాంకేతిక రంగాలలో భారతదేశ ఇన్నోవేషన్ ఎకానమీకి అవసరమైన ముడి పదార్థాల దీర్ఘకాలిక సరఫరాను ఈ ఒప్పందం సురక్షితం చేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి