Breaking News

ఇంట్లోనే ఈజీగా కుట్టు దహీ భల్లా ఎలా తయారు చేయాలి?

కుట్టు పిండి, ఆలూ, పెరుగు తో తయారయ్యే కుట్టు దహీ భల్లా ఇంట్లో సులభంగా చేసుకునే రుచికరమైన స్నాక్.


Published on: 12 Apr 2026 10:31  IST

కావలసినవి:

  • కుట్టు పిండి – 2 కప్పులు
  • ఉడికించిన ఆలూ – 1
  • పచ్చిమిర్చి ముక్కలు – 1 స్పూన్
  • కొత్తిమీర తరుగు – 2 స్పూన్లు
  • పెరుగు – 1 కప్పు
  • మిరియాల పొడి – కొద్దిగా
  • వేయించిన జీలకర్ర – 1 స్పూన్
  • చక్కెర – 2 స్పూన్లు
  • దానిమ్మ గింజలు – కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో కుట్టు పిండి తీసుకుని అందులో ఉడికించి మెత్తగా చేసిన ఆలూ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అనిపిస్తే, కొద్దికొద్దిగా నీరు జోడిస్తూ ముద్దలా తయారు చేయాలి. ముద్ద మృదువుగా, చేతికి అంటకుండా ఉండేలా చూసుకోవాలి.

తర్వాత ఈ ముద్దను చిన్న చిన్న భాగాలుగా తీసుకుని చేత్తో లేదా రోలింగ్ పిన్‌తో చిన్న పూరీల మాదిరిగా వత్తుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఈ పూరీలను మీడియన్ ఫ్లేమ్‌ పై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత వాటిని తీసి వెంటనే చల్లని నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టాలి, దీని వల్ల పూరీలు మెత్తగా అవుతాయి.

ఇక మరో గిన్నెలో పెరుగు తీసుకుని అందులో చక్కెర, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర వేసి బాగా గిలక్కొట్టాలి. పెరుగు మిశ్రమం మృదువుగా, స్వల్పంగా తీపి రుచితో ఉండాలి.

తర్వాత నీటిలో నానబెట్టిన పూరీలను తీసి, చేత్తో స్వల్పంగా ఒత్తి అదనపు నీటిని తొలగించాలి. ఈ పూరీలను సర్వింగ్ ప్లేటులో అమర్చి వాటిపై పెరుగు మిశ్రమాన్ని సమంగా పోయాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగు చల్లి గార్నిష్ చేస్తే రుచికరమైన కుట్టు దహీ భల్లా సిద్ధమవుతుంది.

 

 

Follow us on , &

ఇవీ చదవండి