Breaking News

భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి పంపించేస్తున్న ట్రంప్‌

మిస్సౌరీ, టెక్సాస్, నెబ్రాస్కా సహా పలు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఈ-మెయిల్స్ అందాయి.


Published on: 08 Apr 2025 16:38  IST

అమెరికాలో ఇటీవల కాలేజీలలో జరిగిన నిరసనలపై కఠినంగా స్పందించిన అక్కడి ప్రభుత్వం, విదేశీ విద్యార్థులపై చర్యలు తీసుకుంటోంది. హమాస్‌కు మద్దతుగా చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో, భారతీయ విద్యార్థులతో పాటు పలువురు అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దు చేసింది.కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు, తక్కువ స్థాయి నేరాలు చేసినా కూడా, విద్యార్థులకు అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తోంది. కొన్నిరోజుల కిందట నుంచే అమెరికాలోని మిస్సౌరీ, టెక్సాస్, నెబ్రాస్కా వంటి రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఈ-మెయిల్ రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.ఈ మెయిల్స్‌లో, “మీ F-1 స్టూడెంట్ వీసా ఇక చెల్లదు. మీ సెవిస్ స్టేటస్ రద్దైంది. I-20 ఫారమ్, ఉద్యోగ అనుమతి పత్రాలు కూడా ఇక అమలులో లేవు. మీరు ఇకపై అమెరికాలో ఉండలేరు. తక్షణమే దేశం విడిచి వెళ్లేందుకు ప్రణాళిక వేసుకోండి” అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, లైన్ మార్పులు, మద్యం సేవించి వాహనం నడపడం, షాపింగ్ మాల్‌లలో చిన్న చోరీలు వంటి విషయాలను. ఇవన్నీ సాధారణంగా చిన్న నేరాలుగా పరిగణించబడతాయి. కానీ ఇప్పుడు అవే అమెరికాలో ఉండే హక్కును కోల్పోయే కారణాలవుతున్నాయి.

ఇది నిజంగా అరుదైన పరిణామమని ఇమ్మిగ్రేషన్ నిపుణుడు చంద్ పరవతనేని చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం ఇలాంటి 30 కేసులను వాదిస్తున్నట్టు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి