Breaking News

అపాయింట్‌మెంట్ ఇవ్వాలే కానీ. KCRను స్వయంగా వెళ్లి కలుస్తా.... సీఎం రేవంత్

తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఖరారు చేయడంతో.. ఆయన గెలుపు కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎంపిక తెలుగు ప్రజలకు గౌరవకారణం, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్ తెలిపారు.


Published on: 20 Aug 2025 10:14  IST

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన గెలుపు కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు కృషి చేయాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటన తర్వాత.. మంగళవారం సాయంత్రం తన నివాసంలో CM రేవంత్ మీడియాతో సంభాషించారు. సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయటం తెలుగువారికి దక్కిన అపూర్వ గౌరవమని అభివర్ణించారు. 

సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మెంబర్ కాదని. ఇండియా కూటమి ప్రతిపాదించిన లా ఎక్స్‌పర్ట్ అని చెప్పారు. ఆయనకు ఎలాంటి రాజకీయ పార్టీలతో అనుబంధం లేదని. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెుత్తం 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆయన గెలుపులో సహచరులు కావాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన పార్టీల అధినేతలు కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్‌ కల్యాణ్, అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన BJP ఎంపీలు సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరి బాధ్యత అని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకపోయినా.. తెలంగాణకు చెందిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి విజయానికి సహకరించాలని కమ్యూనిస్టు పార్టీలను CM రేవంత్ రెడ్డి కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి