Breaking News

హైదరాబాద్ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం

హైదరాబాద్ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అనుమానాస్పద మృతులు కలకలం రేపాయి. భార్య, భర్త, వారి చిన్నారి, అత్తామామలు మృతుల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.


Published on: 21 Aug 2025 10:39  IST

హైదరాబాద్ నగరం మియాపూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను భార్య, భర్త, వారి రెండేళ్ల చిన్నారి, అత్త, మామలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులది కర్ణాటక రాష్ట్రంగా తెలిసింది. అనిల్, కవిత దంపతులు, వారి కూతురు రెండేళ్ల అప్పు, కవిత తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకటయ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఏమైనా లభించిందా లేదా అనేది పోలీసులు వెల్లడించలేదు. ముందు చిన్నారిని చంపేసి ఆ తర్వాత వీరు విషం తీసుకొని చనిపోయి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు తర్వాత తెలియనున్నాయి. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Follow us on , &

ఇవీ చదవండి