Breaking News

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల ప్రైవేట్ పీజీ (PG) హాస్టల్ భవనం కుప్పకూలింది.

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల ప్రైవేట్ పీజీ (PG) హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదం సెప్టెంబర్ 6, 2026 (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:15 నుండి 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.


Published on: 07 Sep 2026 14:36  IST

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల ప్రైవేట్ పీజీ (PG) హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదం సెప్టెంబర్ 6, 2026 (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:15 నుండి 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.

మరణాలు ,గాయాలు:ఈ భవన ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు (6) మరణించినట్లు సమాచారం అందుతోంది. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శిథిలాల కింద విద్యార్థులు: ఈ భవనాన్ని బాలుర వసతి గృహంగా (హోస్టల్ డేస్ - Hostel Daze) ఉపయోగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆదివారం కావడంతో దాదాపు 40 నుండి 50 మంది విద్యార్థులు లోపలే ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయక చర్యలు : ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు మరియు స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నాయి. ఇప్పటివరకు 10 నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు.

గుండెలవిసే దృశ్యాలు: శిథిలాల కింద చిక్కుకుపోయిన కొందరు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ మరియు ఫోన్ కాల్స్ చేసి తమ్ము కాపాడాలంటూ రెస్క్యూ సిబ్బందిని, కుటుంబ సభ్యులను వేడుకోవడం అందరినీ కలచివేస్తోంది.

ప్రమాదానికి కారణం: ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఈ పాత భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతులు మరియు తవ్వకాలు జరపడం వల్లే పిల్లర్లు బలహీనపడి భవనం కుప్పకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement