Breaking News

48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని పేర్కొన్న భారత్‌.

భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్. అంతేకాదు భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దుచేసి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని పేర్కొన్న భారత్‌.


Published on: 24 Apr 2025 11:58  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై జరిగిన క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం సుమారు రెండు గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో వివరాలు షేర్ చేశారు.ముఖ్యంగా, భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడాన్ని ఆపే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు.

అంతేకాదు, ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు ఇకపై వీసాలు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇచ్చిన ప్రత్యేక వీసాలు రద్దుచేసి, 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

దిల్లీలోని పాక్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న రక్షణ, నేవీ, వైమానిక శాఖల సలహాదారులు వారం రోజుల్లోగా వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అదే విధంగా, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న అధికారులను కూడా భారత్‌కు పిలిపిస్తున్నారు.

అటారి చెక్‌పోస్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పత్రాలతో పాక్ వెళ్లిన వారు మే 1లోగా తిరిగి రావాల్సిందిగా సూచించారు.

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఇది పిరికితన చర్య. ఈ దాడికి పాల్పడిన వారినీ, మద్దతు ఇచ్చిన వారినీ వదిలిపెట్టేది లేదు’’ అని తెలిపారు. దేశ ప్రజలకు భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి