Breaking News

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారంటూ ప్రచారం జరుగుతోంది.

నిత్యానంద మేనల్లుడు సుందారేశ్వరన్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో, "నిత్యానంద హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు" అని పేర్కొన్నారు.


Published on: 01 Apr 2025 17:02  IST

నిత్యానంద ఆచూకీపై సందేహాలు – బతికి ఉన్నారా? లేదా?

స్వయంఘోషిత గురువు నిత్యానంద ఇటీవల శివరాత్రి సందర్భంగా జరిగిన సత్సంగ్ వీడియో కారణంగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతుండగానే ఒకేసారి ప్రసారం ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిందని భావించినప్పటికీ, అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. దీంతో నిత్యానంద ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

ఈ ఏడాది ఉగాది వేడుకల్లో నిత్యానంద ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా ప్రత్యేక పండుగల సందర్భాలలో ఆయన భక్తులతో వీడియో ద్వారా మాట్లాడుతుంటారు. అయితే ఈసారి అలా జరగకపోవడంతో, ఆయన బతికి లేరా? అన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. రెండు రోజుల క్రితమే నిత్యానంద మరణించారని ప్రచారం మొదలైంది. అయితే, ఈ విషయంపై ఆశ్రమం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నిత్యానంద మేనల్లుడు సుందారేశ్వరన్ గత ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో, "నిత్యానంద హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు" అని పేర్కొన్నారు. కానీ, ఆయన బతికే ఉన్నారా లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇదే మొదటిసారి కాదు

నిత్యానంద మృతి చెందినట్లు ప్రచారం జరగడం మొదటిసారి కాదు. 2022లో కూడా ఆయన మతిమరుపు సమస్యలతో బాధపడుతున్నారని, 27 మంది వైద్యుల సంరక్షణలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆయన మనుషుల పేర్లు, ప్రదేశాల పేర్లు గుర్తుపట్టలేకపోతున్నారని సమాచారం వెలువడింది. ఇప్పుడా ప్రచారం మళ్లీ తలెత్తడంతో, నిజంగా ఆయన బతికే ఉన్నారా? లేక వేరే కారణం ఉందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి