Breaking News

జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా: పవన్ కు హరిరామ జోగయ్య లేఖ

జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ మద్దతుదారులు అసంతృప్తికి లోనయ్యారు. కాపు సంఘం నేత హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పవన్ కు లేఖ రాశారు. జనసేన పరిస్థితి మరీ ఇంత దారుణమా? అని ప్రశ్నించారు. ఈ ప్రకటన రాగానే జనసైనికులు ఒకింత నిరాశకు గురైయ్యారు. పవర్ షేరింగ్ కోసం ఈ సీట్లు సరిపోవని, మరిన్ని సీట్లు అడగాల్సిందని జనసైనికులు భావిస్తున్నారు.


Published on: 26 Feb 2024 19:29  IST

జనసేన మద్దతుదారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు సామాజిక నేత హరిరామజోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకోదన్నారు. జనసేన పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందని ప్రశ్నించారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్‌ అధికారం చేపట్టడమన్నారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, మంత్రి పదవుల్లో చెరిసగం అని ప్రకటన వస్తేనే ఈ సంక్షోభానికి తెరపడుతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి