Breaking News

డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శలు

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు (13 ఏప్రిల్ 2026) తీవ్రంగా స్పందించారు.. 


Published on: 13 Apr 2026 18:34  IST

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు (13 ఏప్రిల్ 2026) తీవ్రంగా స్పందించారు.. 

డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.. ప్రాథమిక విషయాలు తెలియకుండానే ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు..కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు..

డీలిమిటేషన్ వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని, దీనిపై కేంద్రం ఇంకా నిబంధనలను ఖరారు చేయలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు..

Follow us on , &

ఇవీ చదవండి