Breaking News

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరించి ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకుంటుందని తెలియజేశారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు


Published on: 20 Aug 2025 11:26  IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అతాలకుతలం అవుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లింది. చాలా వరకు పంట పొలాల్లో ఇసుక మేట వేసింది. వరదల వల్ల పంటలు నాశనమై రైతులు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తే.. వరుణుడు నిండా ముంచాడని లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 

మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించి.. వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించారు. వరద నష్టాలను అంచనా వేశారు. తొలుత నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ MP సోయం బాపురావులను అడిగి తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి