Breaking News

వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలో వీధి కుక్కల దాడిలో ప్రేమ్‌చంద్‌ అనే మూగ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. 


Published on: 03 Dec 2025 12:39  IST

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలో వీధి కుక్కల దాడిలో ప్రేమ్‌చంద్‌ అనే మూగ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గాయపడిన బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అతని కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా, వీధి కుక్కల బెడదను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలని సూచించారు.వీధి కుక్కల సమస్యపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి తక్షణమే ఒక కాల్ సెంటర్ లేదా టోల్-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వీధి కుక్కల దాడులకు గల కారణాలను విశ్లేషించడానికి, నివారణ చర్యలను సూచించడానికి వెటర్నరీ వైద్యులు మరియు బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.కుక్కల బెడదను అరికట్టేందుకు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను ముమ్మరం చేయాలని ఆదేశించారు.కుక్క కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించడానికి అవసరమైన మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHCలు), పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు ఆసుపత్రులలో అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి