Breaking News

రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపిలో పర్యటించనున్నారు.

రేపు, అంటే అక్టోబర్ 16, 2025న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన కర్నూలు, శ్రీశైలంలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.


Published on: 15 Oct 2025 17:42  IST

రేపు, అంటే అక్టోబర్ 16, 2025న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన కర్నూలు, శ్రీశైలంలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీశైలంలో పూజ ఉదయం 11:15 గంటలకు నంద్యాల జిల్లాలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో పూజలు, దర్శనం చేస్తారు.శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు.

మధ్యాహ్నం కర్నూలులో రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పారిశ్రామిక, విద్యుత్, రోడ్లు, రైల్వే వంటి ఆరు కీలక రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.కర్నూలు సమీపంలోని నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో జరిగే 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. 

ప్రధాని పర్యటన నేపథ్యంలో, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో అక్టోబర్ 16న, 17న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి