Breaking News

ప్రధాని ఉడుపిలో రోడ్‌షో , శ్రీ కృష్ణ మఠం సందర్శన మరియు 'లక్ష కంఠ గీతా పారాయణ' కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (నవంబర్ 28, 2025) ఉడుపిలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన ఉడుపి శ్రీ కృష్ణ మఠం సందర్శన మరియు 'లక్ష కంఠ గీతా పారాయణ' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.


Published on: 28 Nov 2025 12:16  IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (నవంబర్ 28, 2025) ఉడుపిలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన ఉడుపి శ్రీ కృష్ణ మఠం సందర్శన మరియు 'లక్ష కంఠ గీతా పారాయణ' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. 

ఉడుపిలోని బన్నంజే నారాయణ గురు సర్కిల్ నుండి కల్సంక సర్కిల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది.రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది ప్రజలు, భక్తులు గుమిగూడి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రజలు పూలు చల్లుతూ, జై శ్రీరామ్, మోదీకి జై అంటూ నినాదాలు చేశారు.రోడ్‌షో మార్గంలో యక్షగానం, ಹುಲಿ ವೇಷ (పులి వేషం) వంటి స్థానిక సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు.

రోడ్‌షో అనంతరం ప్రధాని శ్రీ కృష్ణ మఠానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కనక కిండికి కొత్తగా తయారుచేసిన 'కనక కవచం' (బంగారు తొడుగు)ను సమర్పించారు మరియు 'సువర్ణ తీర్థ మండపాన్ని' ప్రారంభించారు.లక్ష మందికి పైగా భక్తులు, విద్యార్థులు మరియు పండితులతో కలిసి నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉడుపిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, సుమారు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.

Follow us on , &

ఇవీ చదవండి