Breaking News

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) కి సంబంధించిన రెండో నోటిఫికేషన్ ఏప్రిల్ 13న విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) కి సంబంధించిన రెండో నోటిఫికేషన్ ఏప్రిల్ 13, 2026 (సోమవారం) న విడుదల కానుంది. విద్యాశాఖ ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. 

Published on: 13 Apr 2026 16:38  IST

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) కి సంబంధించిన రెండో నోటిఫికేషన్ ఏప్రిల్ 13, 2026 (సోమవారం) న విడుదల కానుంది. విద్యాశాఖ ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. 

ఏప్రిల్ 13, 2026. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే ఏప్రిల్ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది.జూన్ 2026 రెండో వారంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

డీఈడీ (D.Ed), బీఈడీ (B.Ed) పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లు కూడా ఈ టెట్ రాయాల్సి ఉంటుంది.టీచర్ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.జనరల్/EWS అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 40% మార్కులు రావాలి.

Follow us on , &

ఇవీ చదవండి