Breaking News

Revanth Reddy | ఇగ అప్పు చెయ్య.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేకపోయా!: సీఎం రేవంత్‌రెడ్డి

అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రికార్డుస్థాయిలో రూ.1.53 లక్షల కోట్లు అప్పులు చేసి, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై తాను అప్పులు చేయదలుచుకోలేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభ సాక్షిగా స్పష్టంచేశారు.

Published on: 17 Mar 2025 15:55  IST

హైదరాబాద్‌, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రికార్డుస్థాయిలో రూ.1.53 లక్షల కోట్లు అప్పులు చేసి, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై తాను అప్పులు చేయదలుచుకోలేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభ సాక్షిగా స్పష్టంచేశారు. అప్పుచేసి తినే పప్పు కూడు, అప్పు ఎప్పటికైనా రాష్ర్టానికి ముప్పేనని తాను స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఇకపై అప్పులు చేయబోనని, రాష్ట్ర ఆదాయం పెంచి, పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అందరూ సహకరించాలని కోరారు.

  • అప్పు చేసి తినే పప్పుకూడుతో రాష్ర్టానికి ముప్పు
  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రికార్డుస్థాయిలో రూ.1.53 లక్షల కోట్లు అప్పులు చేసి, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై తాను అప్పులు చేయదలుచుకోలేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభ సాక్షిగా స్పష్టంచేశారు. అప్పుచేసి తినే పప్పు కూడు, అప్పు ఎప్పటికైనా రాష్ర్టానికి ముప్పేనని తాను స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఇకపై అప్పులు చేయబోనని, రాష్ట్ర ఆదాయం పెంచి, పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అందరూ సహకరించాలని కోరారు.

లక్షల మాఫీ అందరికీ చేయలే…
రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు. గత ప్రభుత్వం అప్పులు చేయడం మూలంగా 15 నెలల పాలనలో రూ.1.53 లక్షల కోట్లు అసలు, మిత్తి చెల్లించామని ఆరోపించారు. ఆ మొత్తం నిధులు ఉంటే అర్హులైన 30 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఇండ్లను కట్టించేవాడినని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీఎం పేర్కొన్నారు. 75 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేసేవాడినని చెప్పారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల్లోనూ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని స్పష్టం చేసిన విషయం విదితమే.

Follow us on , &

ఇవీ చదవండి