Breaking News

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, నేడు (డిసెంబర్ 23, 2025) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 


Published on: 23 Dec 2025 18:21  IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, నేడు (డిసెంబర్ 23, 2025) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం జరిగింది.గర్భాలయంలోని మూలవిరాట్టును ప్రత్యేక వస్త్రంతో కప్పి, ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, ఉప ఆలయాలు, గోడలు, పైకప్పు మరియు పూజా సామగ్రిని సుగంధ ద్రవ్యాలతో కూడిన పవిత్ర జలంతో శుద్ధి చేశారు.ఈ శుద్ధి కోసం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ మరియు కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు.

ఈ కార్యక్రమం కారణంగా నేడు అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేయబడింది.ప్రోటోకాల్ వీఐపీలకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.తిరుమంజనం పూర్తయిన తర్వాత, ఉదయం 10:30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. 

సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు (ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం) ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. 

 

 

 

Follow us on , &

ఇవీ చదవండి