Breaking News

TG హైద‌రాబాద్ | ముఖ్యమంత్రి రేవంత్ తో పీపుల్స్ స్టార్ భేటి …

హైద‌రాబాద్ – సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కలిశారు. నేటి ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తిని సీఎం శాలువాతో సన్మానించారు.

Published on: 17 Mar 2025 14:02  IST

హైద‌రాబాద్ – సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కలిశారు. నేటి ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తిని సీఎం శాలువాతో సన్మానించారు.

వచ్చే నెలలో గద్దర్ పేరు మీద తెలంగాణ సినీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్.నారాయణమూర్తి సలహాదారుగా ఉన్నారు. దీనిపై వారిద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌రిపారు..

Follow us on , &

ఇవీ చదవండి