Breaking News

తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...!

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈరోజు ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Published on: 13 Aug 2025 11:15  IST

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది రానున్న 48 గంటల్లో మరింతగా బలపడనుందని అంచనా వేసింది. ఈ జిల్లాల్లో August 13, 14 తేదిలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ రోజు రాష్ట్రంలోని మహబూబాబాద్,  జనగాం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,  జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి