Breaking News

ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను సూట్‌కేస్‌లో నింపిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

భార్యను హత్య చేసిన కేసులో నగర పోలీసులు మహారాష్ట్రకు చెందిన రాకేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచి, పూణేకు పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.


Published on: 28 Mar 2025 15:20  IST

బెంగళూరులోని హుళిమావులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32)గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన రాకేష్ తన భార్య గౌరీని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సూట్‌కేసులో నింపాడు. అనంతరం గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయంలో సమాచారం ఇచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు వెంటనే బెంగళూరులోని హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫోన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు బాత్రూంలో ఉన్న సూట్‌కేసు కనిపించింది. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి పరిశీలించగా, అందులో గౌరీ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

హత్య అనంతరం నిందితుడు రాకేష్ పూణెకు పారిపోయాడు. అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు తీసుకురావడానికి ప్రత్యేక బృందం పూణెకు బయలుదేరింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రాకేష్, గౌరీ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని బెంగళూరుకు వచ్చారని, రాకేష్ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తుండగా, గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది అని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి