Breaking News

ముంబయి 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహవ్వుర్‌ రాణా భారత్ కు చేరుకోనున్నాడు.

అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన తహవ్వుర్‌ రాణా రిట్ పిటీషన్ దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిరస్కరించడంతో భారత్ కు అప్పగింత .


Published on: 10 Apr 2025 16:48  IST

ముంబయి 26/11 ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాను, అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టంగా ఉంచారు. రాణాను తరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, ప్రత్యేక భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

తహవ్వుర్ రాణాను తీసుకువచ్చే విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, అతడిని నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కార్యాలయానికి తరలించనున్నారు. ఈ తరలింపులో బుల్లెట్‌ప్రూఫ్ వాహనం తో పాటు, ప్రత్యేక సాయుధ వాహనాలు, స్పెషల్ కమాండోలు కూడా ఉంటారని సమాచారం. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అప్రమత్తంగా ఉంది.

తహవ్వుర్ రాణా కోసం సిద్ధం చేసిన సాయుధ వాహనం అత్యంత శక్తివంతమైనది. ఇది ఏ రకమైన దాడికైనా తట్టుకోగలదు. సాధారణంగా ఉగ్రవాద ముప్పు ఉన్న సందర్భాల్లో మాత్రమే ఈ వాహనాలను వినియోగిస్తారు.

2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌కు అప్పగిస్తున్నారు. ఈ కేసులో NIA ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. విచారణలో పాకిస్థాన్ ఉగ్రవాద నెట్వర్క్ పాత్రపై స్పష్టత రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ విచారణ ద్వారా 26/11 దాడుల వెనుకున్న అంతర్జాతీయ కుట్రలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. రాణా నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆశిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి