Breaking News

CBSE ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి.. మహిళలకు కూడా ఛాన్స్..

CBSE ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి.. మహిళలకు కూడా ఛాన్స్..


Published on: 05 Dec 2025 18:19  IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గ్రూప్ ఏ, బీ & సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 22.

పోస్టుల సంఖ్య: 124. 

పోస్టులు: అసిస్టెంట్ సెక్రటరీ 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (అకడమిక్స్) 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (ట్రైనింగ్) 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్కిల్ ఎడ్యుకేషన్) 07, అకౌంట్స్ ఆఫీసర్ 02, సూపరింటెండెంట్ 27, జూనియర్ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్ 09, జూనియర్ అకౌంటెంట్ 16, జూనియర్ అసిస్టెంట్ 35. 

ఎలిజిబిలిటీ
అసిస్టెంట్ సెక్రటరీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.

అకౌంట్స్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఎకనామిక్స్/ కామర్స్/అకౌంట్స్/ ఫైనాన్స్/ బిజినెస్ స్టడీస్/ కాస్ట్ అకౌంటింగ్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా అకౌంట్/ ఆడిట్ సర్వీసెస్/కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ విభాగం నిర్వహించిన ఎస్ఏఎస్/ జేఏఓ(సీ) పరీక్షలో ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఎకనామిక్స్/ కామర్స్/ అకౌంట్స్/ ఫైనాన్స్/ బిజినెస్ స్టడీస్/కాస్ట్ అకౌంటింగ్​ ఒక సబ్జెక్టుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/ చార్టర్డ్ అకౌంటెంట్/ ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి ఉండాలి. 

సూపరింటెండెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.

జూనియర్ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీలో మాస్టర్స్ డిగ్రీ, ఇంగ్లిష్​ను తప్పనిసరి లేదా ఎలక్టివ్ సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా చదివి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, హిందీని తప్పనిసరి లేదా ఎలక్టివ్ సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా చదివి ఉండాలి.

జూనియర్ అకౌంటెంట్: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/ ఇన్​స్టిట్యూషన్ నుంచి 12వ తరగతిలో అకౌంటెన్సీ/ బిజినెస్ స్టడీస్/ ఎకనామిక్స్/ కామర్స్/ ఎంట్రప్రెన్యూర్‌షిప్/ ఫైనాన్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ టాక్సేషన్/ కాస్ట్ అకౌంటింగ్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. కంప్యూటర్‌లో ఇంగ్లిషులో 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైపింగ్ వేగం ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా సమాన అర్హత ఉండాలి.

గరిష్ట వయోపరిమితి

అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్: 35 ఏండ్లు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్: 30 ఏండ్లు.

జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్:  27 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 02.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు  గ్రూప్–ఏ పోస్టులకు 1750, గ్రూప్–బీ, సీ పోస్టులకు 1050. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ , మాజీ సైనికులకు, మహిళలకు గ్రూప్–ఏ, బీ, సీ పోస్టులకు రూ.250. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 22.

సెలెక్షన్ ప్రాసెస్: అఖిల భారత పోటీ పరీక్ష (సీబీఎస్ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పరీక్ష 2026)  కంప్యూటర్ ఆధారిత పరీక్ష, నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.cbse.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.

Follow us on , &

ఇవీ చదవండి