Breaking News

తిరుపతి: రైలు పట్టాలపై ప్రేమ జంట.. భయంతో వణికిపోయిన జనాలు

గూడూరు సమీపంలో జంట ఆత్మహత్య కలకలంరేపింది. రైలు పట్టాలపై మృతదేహాలను గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.


Published on: 20 Nov 2023 10:44  IST

 

తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో యువతీయువకులు ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. గూడూరు-కొండాగుంట రైల్వేస్టేషన్‌ల మధ్య తిరుపతి మార్గంలో దిగువ రైలు పట్టాలపై ఇద్దరు చనిపోయి ఉండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలను బట్టి పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడుకు చెందిన దండే రాకేష్‌(23), పల్నాడు జిల్లా మాచవరం మండలం రుక్మిణిపురానికి చెందిన అన్నంగి పావని(19)గా గుర్తించారు

గూడూరు సమీపంలోని టిడ్కో భవన సముదాయం వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వీరి ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ పోలీసులులు పేర్కొన్నారు. మృతులు ప్రేమజంటగా భావిస్తున్నట్లు చెప్పారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి