Breaking News

ఇంకా పూర్తి మోత మోగించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

ఇంకా పూర్తి మోత మోగించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌


Published on: 04 Sep 2025 10:33  IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై సుంకాల విషయాన్ని ప్రస్తావించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, అమెరికా ఇప్పటివరకు పూర్తి స్థాయి ఆంక్షలు విధించలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే కొంతవరకు సెకండరీ సుంకాలు అమలు చేశామని, కానీ ఇంకా రెండు మూడు దశలను చేపట్టలేదని స్పష్టంచేశారు.

ట్రంప్ మాట్లాడుతూ, “భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు భారీ సుంకాలతో అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ప్రపంచంలోనే ఎక్కువ సుంకాలు విధించే దేశం. ఇలాంటి దేశం ఇప్పుడు సుంకాలను తగ్గిస్తానని చెబుతోంది. మనం ఎప్పుడూ సుంకాలు విధించకపోతే వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు కాదు” అని వ్యాఖ్యానించారు.

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, భారత్‌తో అమెరికా సంబంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ, అధిక సుంకాల కారణంగా అది ఏకపక్షంగానే ఉందని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు. “భారత్ నుంచి వస్తువులు అమెరికాకు వరదలా వచ్చాయి. కానీ మనం వాళ్ల దేశంలో పెద్దగా వ్యాపారం చేయలేకపోయాం. అయినప్పటికీ మేము చాలా కాలం సుంకాలు విధించలేదు” అని ఆయన పేర్కొన్నారు.

చైనా–రష్యా–ఉత్తర కొరియా పై ట్రంప్ విమర్శలు

ఇక మరోవైపు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్ ఉన్‌లపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ముగ్గురు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

చైనాలో జరిగిన ఆయుధ ప్రదర్శన నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి