Breaking News

తెలంగాణలో భూకంపంపై భయాందోళనలు – నిజమెంత?

భవిష్యత్తులో రామగుండం ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముందని ఇటీవల ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ పేర్కొంది.


Published on: 10 Apr 2025 16:11  IST

హైదరాబాద్, ఏప్రిల్ 10: రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశముందని ఇటీవల కొన్ని నివేదికలు వెలువడ్డాయి. 'ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ వెల్లడించిన ఈ సమాచారం ప్రకారం, భవిష్యత్తులో అక్కడ భారీ ప్రకంపనలు సంభవించొచ్చని, అవి హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే, ఈ హెచ్చరికలపై అధికారిక స్థాయిలో ఎలాంటి ధృవీకరణ లేదు. భారత ప్రభుత్వ భూగర్భ శాఖ లేదా ఇతర శాస్త్రీయ సంస్థలు దీనిని ధ్రువీకరించలేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందే అంచనా వేయడం శాస్త్రీయంగా కష్టమైన ప్రక్రియ అని నిపుణులు అంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భూకంప ప్రమాదం తక్కువగానే ఉన్న ప్రాంతాల్లోకి వస్తాయి (సీస్మిక్ జోన్ 2, 3). గతంలో ఇక్కడ కొన్ని స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి కానీ, అవి పెద్దగా నష్టాన్ని కలిగించలేదు.

ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ధారణలేని సమాచారంపై భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు సంభవించనప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదన్నది అధికారుల సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి