Breaking News

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనిత, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి.


Published on: 04 Apr 2025 15:24  IST

ఆంధ్రప్రదేశ్ సచివాలయం:అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం బ్యాటరీలు నిల్వ ఉంచే విభాగంలో చోటుచేసుకుంది. మంటలు కనిపించగానే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

తక్షణమే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని నియంత్రించారు. ప్రమాద సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఈ రెండో బ్లాక్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి.

హోం మంత్రి అనిత ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దురుద్దేశ్యంతో జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి