Breaking News

మావోయిస్టుల‌ ఎదురుకాల్పులు – ఐదుగురు మావోయిస్టుల‌ మృతి

ఇంటెలిజెన్స్‌ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా సహా సుమారు 2500 మంది మావోయిస్టులు కర్రగుట్ట అడవుల్లో తలదాచుకున్నట్లు సమాచారంతో విస్తృత కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు.


Published on: 24 Apr 2025 16:45  IST

ములుగు జిల్లా – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమారంపాడు సమీప అటవీప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన సుదీర్ఘ సోదాల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.

ఇటీవల ఇంటెలిజెన్స్‌ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా సహా సుమారు 2500 మంది మావోయిస్టులు కర్రగుట్ట అడవుల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు రెండు రోజులుగా విస్తృత కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి హెలికాప్టర్ల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ చర్యల మధ్య ఎదురైన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ అనంతరం భీమారంపాడు గ్రామస్థులకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి