Breaking News

సెలవుల లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. 2026లో ఏకంగా ఇన్ని సెలవులా?..

సెలవుల లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. 2026లో ఏకంగా ఇన్ని సెలవులా?..


Published on: 09 Dec 2025 10:22  IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను ప్రకటించింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 27 సాధారణ సెలవులు, అలాగే 26 ఐచ్ఛిక సెలవులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ సెలవుల జాబితాను విడుదల చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సాధారణ సెలవులుగా ప్రకటించిన 27 రోజుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు పూర్తిగా మూసి ఉంటాయి. వాటితో పాటుగా ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం యథావిధిగా సెలవులుగానే కొనసాగుతాయి. ఐచ్ఛిక సెలవులు ఉద్యోగుల అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా వినియోగించుకోవచ్చు.

2026లో ముఖ్యమైన సాధారణ సెలవులు

2026 సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ జనవరి 15న అందరికీ సెలవుగా ఉంటుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరగనుంది. హోలీ పండుగ మార్చి 3న, ఉగాది మార్చి 19న రానుంది. ఈదుల్ ఫితర్ (రంజాన్) మార్చి 21న సెలవుగా ప్రకటించారు.

శ్రీ రామనవమి మార్చి 27న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఉంటుంది. మే 27న ఈదుల్ అజహా (బక్రీద్)కు సెలవు ప్రకటించారు. రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకమైన బోనాలు ఆగస్టు 10న జరగనుంది. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న, వినాయక చవితి సెప్టెంబర్ 14న ఉంటుంది. అక్టోబర్ 20న విజయ దశమి (దసరా), నవంబర్ 8న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్‌కు సాధారణ సెలవులు ఉంటాయి.

2026లో ఐచ్ఛిక సెలవులు

ఉద్యోగులు అవసరాన్ని బట్టి వినియోగించుకునే ఐచ్ఛిక సెలవుల్లో న్యూ ఇయర్ డే (జనవరి 1), కనుమ (జనవరి 16), శ్రీ పంచమి (జనవరి 23), మహావీర్ జయంతి (మార్చి 31), బుద్ధ పౌర్ణమి (మే 1), నరక చతుర్దశి (నవంబర్ 8), క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24) వంటి పండుగలు ఉన్నాయి.

ఈ సెలవుల జాబితా ఉద్యోగులు తమ ముందస్తు ప్రయాణాలు, పండుగ క్షణాలు, కుటుంబ కార్యక్రమాలను ప్లాన్ చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Follow us on , &

ఇవీ చదవండి