Breaking News

త్వరలో నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

త్వరలో నిరుద్యోగుల కోసం కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. బుడగ జంగాల కులాన్ని అత్యంత వెనుకబడిన గ్రూప్ 1లో చేర్చారు.ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, యువత ప్రభుత్వ పథకాల ద్వారా మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాలను పొందాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.


Published on: 28 Mar 2025 23:19  IST

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించిన ప్రకారం, త్వరలో నిరుద్యోగుల కోసం కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. బుడగ జంగాల కులాన్ని అత్యంత వెనుకబడిన గ్రూప్ 1లో చేర్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, యువత ప్రభుత్వ పథకాల ద్వారా మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాలను పొందాలని మంత్రి సూచించారు. వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలను గ్రూపుల వారీగా రిజర్వ్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బుడగ జంగాల కుల ప్రతినిధులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి, ఎస్సీ వర్గీకరణ నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే తెలంగాణలో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇంకా వివిధ దశల్లో 10 వేలకు పైగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఉన్నాయి. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనుంది.

అలాగే, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త అందించనుంది. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ తర్వాత తెలంగాణలో చేపట్టబోయే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఈ కొత్త రిజర్వేషన్ల ప్రకారం, నిర్దిష్ట వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కేటాయించనున్నారు. దీనిపై అధికారిక స్పష్టత త్వరలో రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి