Breaking News

పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్ తప్పనిసరి – సెప్టెంబర్ 30 తుది గడువు

వాహనంపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్ లేకపోతే, వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉందని రవాణా శాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది.


Published on: 10 Apr 2025 12:13  IST

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1కంటే ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చించుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ ప్లేట్లను పొందడానికి సెప్టెంబర్ 30 వరకూ చివరి గడువు విధించింది.

వాహన యజమానులు www.siam.in వెబ్‌సైట్ ద్వారా HSRP కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చార్జీలు ఇలా ఉన్నాయి:

  • టూ వీలర్స్‌ (బైకులు): ₹320 – ₹380

  • త్రీవీలర్స్‌ (ఆటోలు): ₹350 – ₹450

  • ఫోర్ వీలర్స్‌ (కార్లు): ₹590 – ₹700

  • కమర్షియల్ వాహనాలు: ₹600 – ₹800

వాహనంపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్ లేకపోతే, వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉందని రవాణా శాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి