Breaking News

సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్

సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్


Published on: 25 Sep 2025 10:48  IST

సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి శామీర్‌పేట్ అవుటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించబోయే రెండో ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రధానమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రక్షణ శాఖ భూముల అప్పగింత సమస్య పరిష్కారం కావడంతో పనుల వేగం పెరగనుంది. సంబంధిత అధికారుల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా అక్టోబరు మొదటి వారంలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో డెయిరీఫాం కారిడార్ పనుల కోసం హెచ్‌ఎండీఏ టెండర్లు ఖరారు చేసింది. అలాగే జవహర్‌నగర్‌లోని సుమారు 300 ఎకరాల భూమిని రక్షణ శాఖకు అప్పగించడంతో, రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అడ్డంకులు తొలగి లైన్‌క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు వివరాలు

 ఎలివేటెడ్ కారిడార్ – 1

  • మార్గం: ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్‌ఛేంజ్ వరకు

  • పొడవు: 18.10 కిలోమీటర్లు

  • అవసరమైన భూమి: 197 ఎకరాలు (వాటిలో 113.48 ఎకరాలు రక్షణ శాఖ భూములు)

  • అంచనా వ్యయం (భూ పరిహారం సహా): రూ. 3,619 కోట్లు

 ఎలివేటెడ్ కారిడార్ – 2

  • మార్గం: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు

  • పొడవు: 5.4 కిలోమీటర్లు

  • అంచనా వ్యయం: రూ. 1,550 కోట్లు

ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు పూర్తయితే, సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్, డెయిరీఫాం ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి