Breaking News

నేటి నుంచి మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రకాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిలో టీడీఎస్ కూడా ఒకటి.

ఇకపై అద్దె విషయంలో వార్షిక పరిమితి ఏకంగా రూ. 6 లక్షలకు పెరిగింది. దీంతో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.


Published on: 01 Apr 2025 16:06  IST

నేడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం – TDS పరిమితి పెంపు

ఏప్రిల్ 1, 2025 నుండి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు ఆర్థిక మార్పులు అమల్లోకి వచ్చాయి. వాటిలో ఒకటి అద్దెపై TDS (Tax Deducted at Source) పరిమితిని రూ. 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచడం. ఈ మార్పు ప్రధానంగా పెద్ద మొత్తంలో అద్దె చెల్లించే వ్యక్తులు, ఆస్తి యజమానులు, వ్యాపార సంస్థలకు ప్రయోజనకరం. అయితే టీడీఎస్ అంటే ఏమిటి? దాని వల్ల ఎవరికీ లాభం? అనే వివరాలను తెలుసుకుందాం.

టీడీఎస్ అంటే ఏమిటి?

TDS (Tax Deducted at Source) అనేది ఆదాయపు పన్ను రకాలలో ఒకటి. ఉదాహరణకు జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులపై వచ్చిన వడ్డీ వంటి ఆదాయాలపై ప్రభుత్వం TDS రూపంలో పన్ను వసూలు చేస్తుంది. అయితే ఇది ప్రతి ఆదాయ వనరుకు వర్తించదు. శాలరీ, రెంట్, బ్రోకరేజీ, కమీషన్ లాంటి ఫీజుల చెల్లింపుల విషయంలో కూడా దీనిని అమలు చేస్తారు. ఇది అద్దె చెల్లించేవారు ఆ అద్దె మొత్తానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని ముందుగా ప్రభుత్వానికి చెల్లించడం. అద్దె చెల్లించిన వ్యక్తి లేదా సంస్థ, అద్దె తీసుకున్న వ్యక్తికి బిల్లును జారీ చేసి, TDS మొత్తాన్ని కట్ చేస్తుంది. 

పెరిగిన పరిమితి – ఎవరికీ ప్రయోజనం?

ఈ కొత్త మార్పు ఇంటి యజమానులు, చిన్న వ్యాపారులు, పెద్ద సంస్థలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. రూ. 6 లక్షల లోపు అద్దె కలిగిన వారికి టీడీఎస్ మినహాయింపు ఉండడంతో వారి చేతికి వచ్చే మొత్తం పెరుగుతుంది. అలాగే, సంస్థలు పెద్ద మొత్తంలో అద్దె చెల్లించేటప్పుడు TDSని ముందుగా కట్ చేసి, పన్ను బాధ్యతను సులభతరం చేసుకోవచ్చు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2025 బడ్జెట్‌లో ఈ మార్పును ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది ముఖ్యంగా ఆర్థిక నియమాలను సులభతరం చేసే మార్పుగా భావిస్తున్నారు.

కోటి మందికి నో ట్యాక్స్..
ఆదాయపన్ను మినహాయింపును రూ. 12 లక్షలకు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి ప్రజల ప్రయోజనం కోసమే పన్ను రేట్లను తగ్గించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి