Breaking News

ఈ రైలులో కిలోమీటరుకు సుమారు 68 పైసలు మాత్రమే ఛార్జీ వసూలు

మధ్యతరగతి ప్రజలకూ తక్కువ ఖర్చుతో ఏసీ రైలు ప్రయాణం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఓ ప్రత్యేక రైలును ప్రారంభించింది.ఈ రైలులో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉంటాయి.


Published on: 08 Apr 2025 14:12  IST

భారతీయ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల ఆధారంగా టికెట్ల ధరలు వసూలు చేస్తోంది. సాధారణంగా స్లీపర్‌, జనరల్‌, చైర్‌కార్‌, ఏసీ కోచ్‌లలో రకరకాల ఛార్జీలు ఉంటాయి. వందే భారత్‌, రాజధాని, శతాబ్దిలాంటివి అయితే మరింత ఖరీదైనవి. అయినా ఆ సౌకర్యాలు, వేగం చూసి ప్రయాణికులు ఎక్కువ ధరకైనా టికెట్ తీసుకుంటున్నారు.అయితే సాధారణ, మధ్యతరగతి ప్రజలకూ తక్కువ ఖర్చుతో ఏసీ రైలు ప్రయాణం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఓ ప్రత్యేక రైలును ప్రారంభించింది. అదే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.

ఈ రైలులో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉంటాయి. మరింత విశేషమేమిటంటే, కిలోమీటరుకు సుమారు 68 పైసలు మాత్రమే ఛార్జీ వసూలు చేస్తారు. ఇది చాలా తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణం అందించే ప్రత్యేక రైలు. వేగంలో కూడా ఇది వందే భారత్‌ రైలుతో పోటీ పడుతుంది — సగటు వేగం గంటకు 70-75 కి.మీ.గరీబ్ రథ్‌ను 2006 అక్టోబర్‌లో మొదటిసారిగా ప్రారంభించారు. మొదటి ట్రైన్ బిహార్‌లోని స‌హ‌ర్సా నుండి అమృత్‌సర్‌ వరకు నడిచింది. ప్రస్తుతం ఈ రైలు దేశవ్యాప్తంగా 26 రూట్లలో నడుస్తోంది.ఈ రైలు ఢిల్లీ-ముంబై, పాట్నా-కోల్కతా వంటి ప్రధాన మార్గాల్లో నడుస్తుండగా, చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే గరీబ్ రథ్‌ అత్యధిక దూరం ప్రయాణించే రైలు కావడం విశేషం. మొత్తం 2075 కిలోమీటర్ల దూరాన్ని ఇది కేవలం 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. టికెట్ ధర కూడా సుమారు రూ.1500 మాత్రమే, అదీ ఏసీ ప్రయాణానికి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కూడా గరీబ్ రథ్ రైళ్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా:

  • విశాఖపట్నం – సికింద్రాబాద్ (12739-12740)

  • సికింద్రాబాద్ – యశ్వంత్‌పూర్ (కర్ణాటక) (12735-12736)

ఈ రెండు రైళ్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరకు మంచి సౌకర్యాలతో ప్రయాణం కావాలంటే గరీబ్ రథ్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి