Breaking News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – నవంబర్‌ 11న పోలింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – నవంబర్‌ 11న పోలింగ్


Published on: 13 Oct 2025 10:45  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసులో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

అధికారుల ప్రకారం, అక్టోబర్‌ 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్‌ 24గా నిర్ణయించారు. నవంబర్‌ 11న పోలింగ్‌ నిర్వహించబడుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఎన్నికల సమయంలో రిటర్నింగ్ ఆఫీస్‌ పరిసరాల్లో భద్రతను దృష్టిలో ఉంచుకుని 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేస్తారు.

నామినేషన్‌ దాఖలు చేయడానికి అభ్యర్థి తోడు మరో నలుగురు మాత్రమే కార్యాలయంలోకి అనుమతించబడతారు. అలాగే మూడు వాహనాలకు మాత్రమే ప్రవేశం ఇస్తారు. నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించబడతాయి.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక నియోజకవర్గ ఓటరు ప్రతిపాదకుడిగా ఉండాలి. స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులు అయితే పది మంది ఓటర్లు ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను https://encore.eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్లైన్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. ఆ తరువాత ప్రింట్ తీసిన హార్డ్ కాపీని తప్పనిసరిగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాలి.

ఈ ఉపఎన్నికలో పారదర్శకతను కాపాడటానికి, నామినేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి