Breaking News

పదేళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే.. ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందన్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందన్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.


Published on: 28 Apr 2025 11:22  IST

హనుమకొండ, ఏప్రిల్ 27:తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన తీరుపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తాము అభివృద్ధి చేసిన తెలంగాణను కాంగ్రెస్‌ క్రమంగా వెనక్కి నడిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.భూముల ధరలు కూలిపోయినట్టు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు, తాగునీరు, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ పాలనలో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు
తాము పాలించిన పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని, కానీ కాంగ్రెస్ ఏడాదిలోనే రాష్ట్రాన్ని దివాలా తీసినట్లు మార్చిందని కేసీఆర్ ఆరోపించారు. భూములు అమ్మడం తప్పుకాదని, అయితే అవసరమైన ఆస్తులను మాత్రమే అమ్మాలని, యూనివర్సిటీ భూములు విక్రయించడం దారుణమని వ్యాఖ్యానించారు.

పోలీసులకు హెచ్చరిక
పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించిన కేసీఆర్, ‘‘మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీరు మీ డైరీల్లో రాసుకోండి అన్నారు’’. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20-30 శాతం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు.స్వయంగా ఆర్థికమంత్రి వద్దకు వెళ్లిన కాంట్రాక్టర్లే ఈ విషయం చెబుతున్నారని అన్నారు. ‘‘కేసీఆర్‌..

ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఛత్తీ్‌సగఢ్‌లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తోందని, ఇది ధర్మం కాదని అన్నారు. బలముందని చంపుకొంటూ వెళ్లడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రతిపాదన పెడుతున్నారని, ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి.. ప్రజాస్వామ్యానికి అవకాశమిస్తూ మావోయిస్టులతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మేరకు సభలో తీర్మానం పెడుతున్నానని, చప్పట్లతో ఆమోదం తెలపాలని సభికులను కోరారు. ‘‘మీ ఆమోదాన్నే తీర్మానంగా భావించి కేంద్రానికి లేఖ పంపుతాం’’ అని అన్నారు.ప్రజాస్వామ్యానికి గౌరవం చూపాలని సూచించారు.

ప్రజలే తేల్చుకుంటారు
‘‘ప్రభుత్వాన్ని మేము కూల్చబోము.ప్రజలు మీకు ఓట్లేశారు. ఆశించిన విధంగా పనిచేయకపోతే.. వారే వీపులు సాపు చేస్తారు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే.. ఇంత పెద్దసంఖ్యలో సభకు కదలి వచ్చారంటే.. మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. ప్రజలు తగిన తీర్పు చెబుతారు అని అన్నారు’’. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళల మధ్య కలహాలు వస్తున్నాయన్నారు.

రాజకీయ విజయం పునరావృతం చేయాలి
కేసీఆర్ చివరగా, ప్రజలను ధైర్యంగా ఉండమని పిలుపునిచ్చారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణను తిరిగి నిలబెట్టాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి